News and Entertainment

మీ రాశిని బట్టి మీ లవర్ కి ఎలాంటి గిప్ట్ ఇవ్వాలో తెలుసా.-3


సింహరాశి
ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే వీరు బాస్‌లా ఉండాలని కోరుకుంటారు. అమ్మాయిలు ఇష్టపడే బహుమతుల విషయానికి వస్తే… బంగారు ఉంగరాలు, నగలు, ఖరీదైన దుస్తులంటే వీరికి చాలా ఇష్టం. సింపుల్‌గా నోరూరించే చాక్లెట్ తీసుకెళ్లి నోట్లో పెట్టేసినా హ్యాపీగానే ఫీలవుతారు. ఇక అబ్బాయిల సంగతి చూస్తే… కెమేరాలు, సెల్ ఫోన్లు, డీవీడీలతోపాటు హాట్ డ్రింక్స్‌ను కూడా పుచ్చుకునేందుకు సిద్ధంగానే ఉంటారు.

కన్యారాశి
కళాత్మకమైన హృదయం. మంచి కల్పనా శక్తి ఉన్నవారుగా ఉంటారు. అదే సమయంలో చాలా సున్నితమైన మనసు కలిగినవారుగా ఉంటారు. ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. ఒక్కసారి ప్రేమలో పడితే… అవతలి వ్యక్తికోసం ప్రాణాన్నిచ్చేందుకైనా సిద్ధమవుతారు. ప్రేమకు గుర్తుగా శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకుంటారు. అమ్మాయిలకు మనస్ఫూర్తిగా ఎటువంటి బహుమతి ఇచ్చినా ప్రేమతో తీసుకుంటారు. అది ఐ లవ్ యూ అని రాసి ఓ తెల్ల కాగితం చేతిలో పెట్టినా దాన్ని జీవితాంతం దాచుకుంటారు. ఇక అబ్బాయిలను చూస్తే… కన్యారాశి అమ్మాయిల మనస్తత్వం ఎటువంటిదో దాదాపు వీరి తత్వం కూడా అలాంటిదే. బహుమతుల విషయంలోనూ అంతే.