News and Entertainment

మీ రాశిని బట్టి మీ లవర్ కి ఎలాంటి గిప్ట్ ఇవ్వాలో తెలుసా.-2


మిధునరాశి
మిధునరాశికి చెందినవారు మేధాపరమైన, ఆశ్చర్యాన్ని రేకిత్తించే వస్తువుల పట్ల మక్కువ చూపుతారు. జ్ఞానాన్ని సముపార్జించే ఎటువంటి వస్తువైనా వీరిని సంతృప్తి పరుస్తుంది. మిధునరాశికి చెందిన అమ్మాయిల విషయానికి వస్తే… వీరికి మేధాశక్తిని పెంచే పుస్తకాలతోపాటు లవ్ మెసేజ్‌లను పంపుకునే రికార్డెడ్ పరికరాలంటే చాలా చాలా ఇష్టం. ఇక అబ్బాయిలకు కంప్యూటర్, ఆసక్తికర అంశాలను తెలిపే డీవీడీలంటే ఎంతో ఇష్టం.

కర్కాటక రాశి
వీరు ప్రతిదాన్ని సంప్రదాయబద్ధంగా ఉండాలని చూస్తారు. విలువైన వస్తువులంటే వీరికి ఎంతో ఇష్టం. అమ్మాయిల విషయానికి వస్తే… అందానికి మెరుగులు దిద్దే సాధనాలను బాగా ఇష్టపడతారు. ఖరీదైన ఫోటో ఫ్రేములు కూడా వీరిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే.. వీరు తాము ఇష్టపడే ప్రియుని అలా తమ గదిలో ఫోటో ఫ్రేములో బంధించి చూసి ఆనందిస్తుంటారు కనుక. ఇక అబ్బాయిల విషయానికి వస్తే… రొమాంటిక్ క్యాండిల్ లైట్స్ కింద తనకు నచ్చిన అమ్మాయితో డిన్నర్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ వాలెంటైన్ డే నాడు అటువంటి ఆఫర్‌ను ప్రేయసి ఇస్తే అతడు తన జన్మ ధన్యమైందనుకుంటాడు.