News and Entertainment

కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై పవన్‌

ఇజం పుస్తకాన్ని ఐదవ తరగతి విద్యార్థి కంటే హీనంగా రాసి తికమక పెట్టారంటూ మరో సందర్భంలో విమర్శించారు. నటన తెలియని స్టార్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌ అని, సమాజానికి ఏదో చేయాలని హడావుడి తప్ప ఏమీ చేయలేని వ్యక్తి అంటూ, తన అభిమానులను కన్వ్యూజ్‌ చేసే వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అంటూ చాలా సీరియస్‌గా కత్తి మహేష్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పవనిజం అంటే ఉగ్రవాదంలా తయారు అయ్యిందని, పవన్‌ అభిమానులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ కత్తి మహేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త‌న‌కు ప్ర‌తిరోజు ఫోన్ చేస్తూ, మెగా ఫ్యామిలీ జోలికి రావ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని తెలిపాడు. ఫ్యాన్స్ త‌న‌పై ప్ర‌వ‌ర్తించిన తీరుకి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మహేశ్ కత్తి డిమాండ్ చేశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నానని చెప్పుకుంటూ, ఎక్క‌డో ఉండి ఒక్క ట్వీటు చేస్తున్నాడ‌ని ఎద్దేవా చేశాడు. ట్వీటు చేయ‌డం ‌ఘన‌కార్యమా? అని ప్ర‌శ్నించాడు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నానని ట్వీటు చేయ‌మ‌నండి అని డిమాండ్ చేశాడు. ఈ మూడు రోజుల్లో కత్తి మహేష్‌ సోషల్‌ మీడియాలో హీరో అయ్యాడ

కత్తి మహేష్‌ను విమర్శించే వారు ఎంత మంది ఉన్నారో, ఆయనకు అనుకూలంగా మాట్లాడే వారు కూడా అంతే ఉన్నారు. ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు పవన్‌ కళ్యాణ్‌ ఏమనుకుంటున్నాడు అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. తన 25వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌కు ఇప్పటికే కత్తి మహేష్‌ విషయం చేరి ఉంటుంది. కాని సన్నిహితుల వద్ద తప్ప ఇప్పటి వరకు పవన్‌ ఆ విషయాన్ని మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. పబ్లిసిటీ కోసం కొందరు ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ను వాడుతూ ఉంటారు, వారి గురించి తాను పట్టించుకోను, అభిమానులు కూడా పట్టించుకోకుంటే బాగుంటుందని, అయితే తాను అభిమానులకు ఎలాంటి సందేశం ఇవ్వను అంటూ తనకు ఆప్తుడు అయిన ఒక నటుడితో పవన్‌ అన్నట్లుగా తెలుస్తోంది. అంటే కత్తి మహేష్‌ గురించి మాట్లాడితే ఆయన్ను ఇంకా హీరోను చేయడం అవుతుందని, అందుకే ఈ విషయమై పవన్‌ స్పందించక పోవడమే మంచిదనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతుంది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం కత్తి మహేష్‌ను సోషల్‌ మీడియాలో ఏకి పారేయడం ప్రారంభం అయ్యింది. బయట కనిపిస్తే బౌతిక దాడులు కూడా తప్పేలా లేవు.