News and Entertainment

అత్తా మామలతో కోడలు హనీమూన్.. నరకం-1

భర్త అర్సలాన్‌ ఉండి కూడా ఈమె ఒంటరిగా హనీమూన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అది కూడా అత్తామామలతో కలిసి ఈమె హనీమూన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది. భర్తకు వీసా రాకపోవడంతో భార్య ఒక్కతే హనీమూన్‌కు వెళ్లింది. అత్తామామలు ఆమె వెంట ఉన్నారు. దాంతో ఆమె విరహంతో రగిలిపోయి ఒంటరిగానే ఫొటోలు తీసుకుంది.


పూర్తి విరాల్లోకి వెళ్తే... హుమాతో కలిసి ఆమె భర్త అర్సలాన్‌ సెకండ్‌ హనీమూన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో తన తల్లిదండ్రులను సైతం తీసుకు వెళ్లాలని భావించాడు. అందుకోసం వీసాల కోసం దరకాస్తు కూడా చేయడం జరిగింది. అర్సలాన్‌కు తప్ప మిగిలిన ముగ్గురికి వీసాలు వచ్చాయి.
వీసాలు రావడంతో వారు ముగ్గురు ప్రయాణంకు సిద్దం అయ్యారు. అర్సలాన్‌ కూడా చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చు అని ప్రయాణంకు సిద్దం అయ్యాడు. అయితే ఆయనకు గ్రీస్‌ ఎంబసీ ఎంతకు వీసా ఇవ్వలేదు. దాంతో తప్పని పరిస్థితుల్లో అత్తా మామలతో కలిసి హుమా మాత్రమే పర్యటకు వెళ్లింది. అక్కడ భర్త లేని లోటు కలగడంతో పక్కనే ఉన్నట్లుగా చేయి పెట్టి ఫొటోలు దిగింది. వాటిని నెట్ లో కూడా పోస్ట్ చేసింది...బాధతో
సినిమాలు జీవితాల్లోనిచి వస్తాయని తెలుసుగానీ... సినిమాలంటి జీవితాలూ ఉంటాయనిపించటం లేదూ... పాపం ఒంటరి హనీమూన్ అంటే ఎవరికైనా భాదే కదా...
ఇంతకీ ఈ విషయం కంగనాకు తెలుసో లేదో గానీ.... హుమా, అర్సలాన్ లు ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం తో విపరీతమైన స్పందన మాత్రం వస్తోంది... ఇంతకీ వాళ్ళు కూడా క్వీన్ సినిమా ని చూసారో లేదో.... ఇప్పుడు చూస్తే మాత్రం థ్రిల్లైపోతారు మరి.