News and Entertainment

బిగ్ బాసా మిడ్నైట్ మసాలా?.. అక్రమ సంబంధాల గోలేమిటిరా-1

కల్పన భర్తగా శివబాలాజీ స్టయిల్‌గా నటించాడు. ధన్‌రాజ్‌కు భార్యగా ముమైత్ నటించింది. పనిమనిషిగా హరితేజ కనిపించింది. శివబాలాజీ, ధన్‌రాజ్‌కు గాలం వేసే వంట మనిషిగా హరితేజ ఆకట్టుకొన్నది. గోపి లోలా అంటూ పాట పాడుతూ.. ధన్‌రాజ్‌ను పిలిచే సీన్‌లో తెగ అలరించింది. కల్పన కూడా నా మొగుడితో నీకేంటి పని అని హరితేజతో గొడవ పడటం కూడా ఓకే అనిపించేలా ఉంది. ఇక మహేశ్ కత్తికి చాలా రోజుల తర్వాత చేతినిండా పనిదొరికింది.
ఇక మంగళవారం ఎపిసోడ్‌లో ముమైత్ ఎందుకు ఆవేశపడిందో ఎవరికీ అర్థం కాదు. గేమ్ కాన్సెప్ట్ అర్థం కానందుకా? లేదా అర్చన మాట్లాడిన తెలుగు భాషను అర్థం చేసుకోలేకానా అనే సందేహం వీక్షకులకు కలుగకమానదు. 16వ రోజు ఎపిసోడ్ చూస్తే ముమైత్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారో అనేది ఓ పట్టాన అర్థం కాదు.

ఇక బిగ్‌బాస్‌ను చూస్తే తెలుగు రియాలిటీ షో నేనా అనే అనుమానం కలుగక మానదు. తెలుగు సీరియల్‌లో సబ్‌టైటిల్స్ వేస్తూ బుల్లితెర వీక్షకులను విసుగు పుట్టిస్తున్నారు. మంచిగా తెలుగు మాట్లాడే జ్యోతి, మధుప్రియలను బయటకు పంపించి భాష రాని ముమైత్‌తో నరకం చూపిస్తున్నారు. బిగ్‌బాస్ ముమైత్‌ను ఎలిమినేట్ చేయండి అని దూకుడులో బ్రహ్మానందం అరిచే విధంగా ప్రేక్షకులుగా మారాల్సిన పరిస్థితి ఎదురవుతుందో ఏమో.
ఇంటిల్లి పాది, పిల్లా జెల్లా కూర్చొని చూసే కార్యక్రమం అని మరిచారేమో నిర్వాహకులు.. అక్రమ సంబంధాలను ప్రోత్సహించే విధంగా వీక్షకులకు రోత పుట్టించారు. కొన్ని ఎపిసోడ్లను ఆహ్లాదకరంగా చూపిస్తూ.. వెంటనే వెగటు పట్టించే విధానాన్ని చూస్తే బిగ్‌బాస్ కార్యక్రమం విపరీతమైన ఒత్తిడికి లోనైనా సెన్సెక్స్ గ్రాఫ్‌లా అనిపిస్తుంది.

బిగ్‌బాస్ 16వ రోజు ఎపిసోడ్ దిశానిర్దేశం లేకుండా గందరగోళంగా సాగింది. వినియోగదారులు, వసూలు దారులు అంటూ ఓ కాన్సెప్ట్‌తో సాగిన ఎపిసోడ్ చాలా నీరసంగా మారింది. 70 రోజుల్లో ఎలా ముగించాలా అనే నెపంతో ఏదో టైంపాస్ కోసం ఆడిన గేమ్‌లా కనిపించింది. గేమ్ విధానాన్ని మార్చి కొంత జనరంజకంగా మారిస్తే తప్ప బిగ్‌బాస్ దూసుకుపోయే అవకాశం కనిపించడం లేదు.