News and Entertainment

ప్రభాస్ తో రాజమౌళి కొత్త మూవీ.. స్టోరీ లీక్.-1

ఆ రెండు సినిమాల తర్వాత ప్రభాస్‌, రాజమౌళిల కాంబో మూవీ 2019లో ప్రారంభం అయ్యి, 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రభాస్‌ కోసం ‘బాహుబలి’ చిత్రీకరణ సమయంలోనే రాజమౌళి ఒక స్టోరీ లైన్‌ సిద్దం చేశాడట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఆ కథను ఇప్పటికే పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చే పనిలో ఉన్నాడు. ఇక కథ విషయానికి వస్తే పౌరాణిక నేపథ్యం కాకుండా, ఒక పక్కా తెలుగు కమర్షియల్‌, సోషల్‌ సబ్జెక్ట్‌తో రాబోతున్నారట. వీరిద్దరి కాంబోలో మూవీ కోసం ప్రేక్షకులు ఇప్పటి నుండే ఎదురు చూస్తూ ఉన్నారు.

2020 వరకు రాజమౌళి, ప్రభాస్‌ సినిమా కోసం ఆగాల్సిందే. ‘బాహుబలి’ సినిమా తర్వాత ఇద్దరి కాంబో మూవీకి భారీ క్రేజ్‌ రావడం ఖాయం. ఆ స్థాయిలో జక్కన్న సినిమాను తెరకెక్కిస్తాడని ప్రేక్షకులు ఇప్పటి నుండే ఆశిస్తున్నారు. ఇక ఆ చిత్రానికి ముందు మరో సినిమాను రాజమౌళి చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించి 2018 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా హీరో ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దానయ్య నిర్మాణంలో రాజమౌళి ఆ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.