News and Entertainment

ఈ నెల 12 న ఆకాశంలో అద్భుతం జరగబోతుందట.. అస్సలు మిస్సవకండి


ఆగస్టు 12న మానవ చరిత్రలోనే మునుపెన్నడూ కనీవినీ ఎరుగనంత అతిపెద్ద ఉల్కాపాతం సంభవించబోతోందని చెపుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ రోజు రాత్రి కూడా పగలు వలె కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపుగా గంటకు 100 వరకు ఉల్కలు నేల రాలతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దృశ్యాలను చూడగలమని అంటున్నారు. 109 పీస్విఫ్ట్‌–టట్టెల్‌ అనే తోకచుక్క నుంచి ఈ ఉల్కలు రాలుతాయని చెప్పారు.

మన అవసరాలకు ప్రకృతిని పాడుచేస్తుంటే.. కార్బన్‌ ఉద్గారాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే.. మరో వందేళ్లలో ఊహించుకోవడానికే వీలుకాని భయంకర పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ శాస్త్రవేత్తలు. ఈ శతాబ్దంలోనే ఉష్ణోగ్రత మరో ఐదు డిగ్రీలు పెరిగే అవకాశముందట. ఉష్ణోగ్రత 2 నుండి 4.9 డిగ్రీల మధ్య పెరగడానికి 90 శాతం అవకాశం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఫలితంగా కరువుతో ప్రజలు విలవిల్లాడిపోతారని, వడగాడ్పులు ఇప్పటి కంటే పదింతలు ఎక్కువవుతాయని వెల్లడించారు.తరువాతి పేజీలో ఇంకా ఉంది..