News and Entertainment

బాహుబలి 2 పోస్టర్ లో దారుణమైన తప్పు! మీరు గమనించారా?



మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజమౌళిని మించిన డైరెక్టర్ లేరనే చెప్పాలి. ఇతర డైరెక్టర్లని అడిగినా... ఇదే విషయం చెబుతారు. బాహుబలి సినిమాతో తెలుగు చలనచిత్ర సత్తా ప్రపంచమంతా తెలిసేలా చేశాడు. టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాశాడు. కేవలం తెలుగులోనే కాదు... అనువాదించబడిన అన్ని బాషల్లోను సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ జనమైతే... మన దేశంలో ఇప్పటి దాకా బాహుబలి లాంటి చిత్రాన్ని చూడలేదని ప్రశంసలు కురిపించారు. ఇక బాహుబలి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

2017 ఏప్రిల్ నెలలో బాహుబలి 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర దర్శకుడు రాజమౌళి ఎప్పుడో చెప్పేశాడు. ఇక సినిమా విదులవుతుందంటే... పోస్టర్ లు, టీజర్ లు, ట్రైలర్ లు, ఈవెంట్ లు, పాటలు... లాంటి ఎన్నో విధాల ప్రమోషన్స్ ఉంటాయి. ఈ కాలంలో సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్.... ఇలా ఏ వుడ్ తేసుకున్నా సోషల్ మీడియాతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అదే విధంగా మన జక్కన్న కూడా బాహుబలి 2 చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇందులో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా కనిపించడం వల్ల ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. కాకపోతే ఈ పోస్టర్ లో ఓ భారి తప్పు జరిగిపోయింది. ఈ పోస్టర్ లో హీరో, హీరోయిన్లు.. బాణాలని పట్టుకునే విధానం కొత్తగా ఉన్నా... అనుష్క పట్టుకున్న ధనుస్సు పైకి ప్రభాస్ పట్టుకున్న బాణాలు రావడంపై ప్రశ్నలు మొదలవుతున్నాయి. అసలు అలా పట్టుకోవడం సుసాధ్యం అంటున్నారు చాలా మంది. ఇవి గ్రాఫిక్స్ లో అతికించిన బాణాలని తెలిసినా.. మరీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారనే విషయం పై సోషల్ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. పోస్టరే ఇలా ఉంటె ఇక సినిమా ఎలా ఉంటుందో అని... మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి మన జక్కన్న ఎలాంటి సమాధానం ఇస్తాడో వేచి చూడాలి.

ఆ తప్పు ఎలా ఉందో మీరే చూడండి..!!