News and Entertainment

అజ్ఞానమే నేటి జ్ఞానం

source: గొల్లపూడి మారుతీరావు జీవన కాలమ్
ఈ దేశంలో అజ్ఞానానికి మరో ఆస్కారం లేదు. చచ్చినట్లు ప్రథమ స్థానంలో ఉండటమే. అవినీతి పెట్టుబడికి పుష్పించిన ‘అజ్ఞానం’ ఎప్పుడూ మీదికి ఎగబాకుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడెవరికీ జ్ఞానం అక్కరలేదు.

 చాలా సంవత్సరాల కిందట- ఒక పాత్రికే యుడు అనుకుంటాను- ఒక దుర్మార్గమైన పని చేశాడు. రాజకీయ నాయ కులలో విజ్ఞానాన్ని వెదకా లనే సాహసం చేశాడు. జన గణ మన ఎవరు రాశారు? అన్న ప్రశ్న వేశాడు. చాలామంది తెల్లమొహం వేశారు. కొందరు కష్టపడి, ప్రయత్నం చేసి ‘మహాత్మా గాంధీ’ అన్నారు. మరికొందరు తడువుకోకుండా ‘జవహ ర్లాల్ నెహ్రూ’ అన్నారు.  ఈ మధ్య బిహార్‌లో రాష్ట్రంలోకల్లా ప్రథమ స్థానంలో నిలబడిన విద్యార్థులు తీరా ప్రశ్నలు అడిగే సరికి- భయంకరమైన సమాధానాలు చెప్పారట. ప్రభుత్వం కోపం తెచ్చుకుని ఇలా ‘అజ్ఞానానికి’ పట్టం కట్టిన అందరినీ- విద్యార్థులతో సహా- అరెస్టులు చేయించింది. ఇది అన్యాయం అని మనవి చేస్తున్నాను.



అజ్ఞానం కొందరి జన్మహక్కు. దాన్ని ఏ జ్ఞానమూ రూపుమాపలేదు. ఈ విద్యార్థులు బిహార్ మంత్రివర్గంలో ఉండే అర్హతలను సంపాదించుకు న్నారని నితీశ్ కుమార్‌గారు గ్రహించాలి. వారి మంత్రి మండలిలో బొత్తిగా చదువులేనివారి దగ్గ ర్నుంచి, హైస్కూలు చదువు కూడా లేనివారు ఎందరో ఉన్నారు. నా ప్రశ్న: చదువులేనివారు ఉండటం మంచిదా? చదువు వచ్చిందని డిగ్రీలు ఉన్నవారు ఉండటం మంచిదా? ఏనాడయినా, ఏ పెద్దమనిషి అయినా లాలూప్రసాద్‌గారికి కానీ, రబ్రీదేవిగారికి కాని చదువు పరీక్షలు పెట్టే సాహసం చేశారా? బాబూ! మనది ప్రజాస్వామ్యం. అజ్ఞానం మన జన్మ హక్కు.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...