News and Entertainment

ప‌వ‌న్ నాలుగో వైఫ్ ఎవ‌రో తెలుసా..?




ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు చెబితే చాలు అభిమానులు ఊగిపోతారు.ఇంక ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ వంట్లోకి తెలియని కరెంట్ వచ్చినట్లు పూన‌కం వ‌స్తుంది. ప‌వ‌న్‌కు ఫ్యాన్స్ కన్నా భ‌క్తులే ఎక్కువ‌. తాజాగా ఆయ‌న న‌టించిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ఏప్రిల్ 8న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇదిలా ఉంటే ప‌వ‌న్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఆయ‌న ఫ్యాన్స్ రెట్టింప‌య్యారు. అన్ని కులాల్లోను, అన్ని పార్టీల్లోను ప‌వ‌న్ మానియా, ఆయ‌న క్రేజ్ విప‌రీతంగా క‌నిపిస్తోంది.



ఇదిలా ఉంటే రీసెంట్‌గా కాజల్ పవన్‌తో దిగిన ఫొటో త‌న ఫేస్‌బుక్‌లో పెట్ట‌డం వివాస్ప‌ద‌మైంది. దీనిపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల నుంచి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప‌వ‌న్‌తో సర్దార్ సినిమాలో న‌టిస్తున్న ఈ అమ్మ‌డు ఓ పాట షూటింగ్ కోసం స్విట్జ‌ర్లాండ్ వెళ్లింది. అక్కడ పవన్ తో క్లోజ్‌గా దిగిన కొన్ని ఫోటోలు తన ఫేస్‌బుక్ అక్కౌంట్‌లో పోస్ట్ చేసింది.


ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్లు కాజ‌ల్‌కు చాలా స‌ల‌హాలు ఇస్తున్నారు. నీ పక్కన ఉన్నది ఎవరు..నీ అసిస్టెంటా అని కొందరు కామెంట్లు వేస్తుంటే..మ‌రికొంద‌రు అత‌డికి మ‌రీ అంత క్లోజ్‌గా ఉండ‌కు…నువ్వు ఫోర్త్ వైఫ్ అయిపోతావ్ అని సంచలనమైన కామెంట్లు పెడుతున్నారు. నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్…నీ పక్కన ఉన్న వోల్డ్ మ్యాన్ ఎవరంటూ కామెంట్లు పెట్టారు. అయితే అస‌లు కాజ‌ల్ ఈ ఫొటోలు ఎందుకు పెట్టాల‌ని…ఇలా త‌మ అభిమాన హీరోపై కామెంట్లు చేసేందుకు ఎందుకు ఆస్కారం ఇవ్వాల‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.